: అసెంబ్లీ ఛాంబర్ లో జగన్ తో సమావేశమైన జేసీ దివాకర్ రెడ్డి
అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్ లో టీడీపీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ తో భేటీ అయ్యారు. జగన్ తో దేని గురించి సమావేశమయ్యారని విలేకరులు ప్రశ్నించగా... తాను జగన్ ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, తామిద్దరి మద్య ఎలాంటి రాజకీయ విషయాలు ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అసెంబ్లీని పరిశీలించడానికే తాను ఈ రోజు వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.