: 'టాయిలెట్స్ ఫర్ గర్ల్స్'పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి: రాష్ట్రాలను కోరిన మంత్రి స్మృతి


'టాయిలెట్స్ ఫర్ గర్ల్స్' ప్రాజెక్టుపై త్వరలో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్ని రాష్ట్రాలను కోరారు. ఈ క్రమంలోనే మంత్రి అన్ని రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం వచ్చే ఏడాది జులై కల్లా టాయిలెట్లు నిర్మించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ, ఏడాదిలోగా అన్ని పాఠశాలలు బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందులో ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సెక్టార్ కూడా చేతులు కలిపి తగినంత సాయం చేయాలని అప్పుడే మోడీ కోరారు.

  • Loading...

More Telugu News