: బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల సమాధానం


ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ పై సమాధానమిస్తున్నారు. విపక్ష నేత బడ్జెట్ ను తొలిసారిగా చూసినట్లుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రాథాన్యతను బట్టి బడ్జెట్ లో కేటాయింపులు జరిపామన్నారు. పాదయాత్రలో చంద్రబాబు ఇచ్చిన డిక్లరేషన్ లు అన్నింటినీ బడ్జెట్ లో పొందుపరిచామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. విపక్ష నేత ఛార్జి షీట్ల గ్రోత్ రేట్ బాగున్నదన్నారు. ఆరోపణలు చేసినప్పుడు వాటిని నిరూపించాలని తెలిపారు. వైఎస్ తనయుడి చర్యల వల్ల రాష్ట్ర బ్రాండ్ పాతాళంలోకి దిగజారిందన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశారో చెప్పేందుకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. గత పదేళ్లలో అభివృద్ధి రేటు దిగజార్చి, దోపిడీ రేటును పెంచుకున్నారని అన్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయమంతా ఎక్కడికెళ్లిందని, జలయజ్ఞం డబ్బులు ఎవరివద్ద ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదు, బెంగళూరులోని ఎస్టేట్, బంగళాలను అవినీతి సొమ్ముతో నిర్మించారన్నారు.

  • Loading...

More Telugu News