: ఆధార్ కార్డు ఆధారంగానే రుణ మాఫీ: ప్రత్తిపాటి పుల్లారావు
ఆధార్ కార్డు ఆధారంగానే రుణ మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఆధార్ కార్డు లేకుంటే ఓటరు కార్డు, రేషన్ కార్డు ఉండాలని ఆయన అన్నారు. 2013 డిసెంబరు 31లోపు తీసుకున్న రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందని ఆయన చెప్పారు. 2014లో తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని ఆయన పేర్కొన్నారు. బంగారం రుణాలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయని ప్రత్తిపాటి చెప్పారు. ఆప్కాబ్ ద్వారా ఈ సీజన్ లో వెయ్యి కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నారని ఆయన తెలిపారు.