: సల్మాన్ కేసులో అన్ని పత్రాలు, డైరీ దొరికాయి
నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో ముఖ్యమైన అన్ని పత్రాలు, పోయిందనుకున్న డైరీ దొరికాయని ముంబయి పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో క్షుణ్ణంగా వెతకడంతో నాలుగు రోజుల కిందట పోయాయనుకున్నవి కనిపించినట్లు నగర తొమ్మిదవ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చౌదరి చెప్పారు. ఈ పేపర్లను సెప్టెంబర్ 12న జరగనున్న తదుపరి విచారణ సందర్భంలో పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. కేసులో పత్రాలు, డైరీ కనిపించలేదని చెప్పడంతో కోర్టు పోలీసులపై తీవ్రంగా మండిపడింది.