: సెప్టెంబర్ 5న విజయవాడలో అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం: మంత్రి గంటా


విజయవాడలో సెప్టెంబర్ ఐదవ తేదీన ప్రభుత్వం తరపున అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తామని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అదే రోజున ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అటు డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 3న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గొంటున్నట్లు గంటా వివరించారు.

  • Loading...

More Telugu News