: తొలుత నేను బీజేపీ కార్యకర్తనే: జగ్గారెడ్డి


కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరిన జగ్గారెడ్డి మెదక్ లోక్ సభ ఉప ఎన్నికకు టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తాను మొదట బీజేపీ కార్యకర్తనేనని, ఏబీవీపీ నుంచే క్రియాశీల కార్యకర్తగా ఎదిగానని చెప్పారు. ఈ సమయంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తప్పక గెలుస్తానని భావిస్తున్నానని తెలిపారు. గెలిస్తే మెదక్ జిల్లాకు అభివృద్ధి పథకాలు తెస్తానని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News