: రాజధానిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు: మంత్రి నారాయణ
ఈ నెల 31లోగా రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. కేంద్రానికి నివేదిక సమర్పించిన రోజే కమిటీ ఆంధ్రప్రదేశ్ కు వస్తుందని చెప్పారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత రాజధాని అంశంపై మంత్రి వర్గంలో చర్చిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.