: హైదరాబాదులో సబ్సిడీపై మట్టి విగ్రహాలను అందిస్తున్న హెచ్ఎండీఏ


హైదరాబాదు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వినాయకచవితి సందర్భంగా 10 పార్కుల్లో మట్టివిగ్రహాలను సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెరువుల పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ మట్టి గణపతుల క్యాంపెయిన్ ను నిర్వహిస్తోన్న హెచ్ఎండీఏ మట్టి ప్రతిమల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది. రూ.26 విలువైన ఎనిమిది అంగుళాల విగ్రహాలను సబ్సిడీపై 13 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారికి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి వినాయక విగ్రహాల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. నగరంలో వినాయక విగ్రహాలు పంపిణీ కేంద్రాలు ఇవే: లుంబినీ పార్కు, వనస్థలిపురంలోని రాజీవ్ గాంధీ పార్కు, ఎల్ ఐజీ పార్కు, సరూర్ నగర్ లోని ప్రియదర్శిని పార్కు, సఫిల్ గూడ లేక్ పార్క్, అత్తాపూర్ లోని చిన్నా తాళ్లకుంట పార్కు, కూకట్ పల్లిలోని పటేల్ కుంట పార్కు, హైటెక్ సిటీలోని దుర్గం చెరువు పార్కు, నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్కు

  • Loading...

More Telugu News