: సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చెవిరెడ్డి వివరణ
స్పీకర్ కోడెల శివప్రసాద్ ను అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ కలిశారు. సభా హక్కుల ఉల్లంఘనపై స్పీకర్ కు చెవిరెడ్డి వివరణ ఇచ్చారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం చెవిరెడ్డిపై అధికారపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే.