: క్రిమినల్ నేపథ్యం ఉన్న వారిని కేబినెట్ లోకి అనుమతించవద్దు: సుప్రీంకోర్టు సూచన
క్రిమినల్ కేసులున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు అనర్హత వేటు వేసేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశంపై నిర్ణయాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల వివేకానికే వదిలిపెడుతున్నట్లు ఐదుగురు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. నేరచరిత ఉన్న వారిని, విచారణ ఎదుర్కొంటున్న వారిని ప్రధానమంత్రి, సీఎంలు మంత్రివర్గంలో చేర్చుకోవద్దని కోర్టు సూచించింది. అలాంటి వారిని మంత్రులుగా విధుల నిర్వహణకు అనుమతించరాదని చెప్పింది. అవినీతి, నేరాభియోగాలు ఉన్నవారు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించడం సరికాదన్న సుప్రీం... ప్రధాని, సీఎంలపై రాజ్యాంగపరంగా గురుతర బాధ్యతలున్నాయని ఉద్బోధించింది.