: అధికార పార్టీకి గుణపాఠం చెప్పేలా మెదక్ ఉప ఎన్నిక ఫలితాలు: పొన్నాల
మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పక ఆదరిస్తారని, అధికారంలో ఉన్న పార్టీకి గుణపాఠం చెప్పేలా ఫలితాలు వస్తాయని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పార్టీ మెదక్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డితో కలసి హైదరాబాదులో తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, తనను మెదక్ లోక్ సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్ఠానానికి సునీత కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్నారు.