: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు


తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతోందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News