: ఖమ్మం కార్పొరేషన్ లో పనిని పక్కన పెట్టిన పారిశుద్ధ్య కార్మికులు


ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని ఖనాపురం హవేలీలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. వేతనాలు సకాలంలో చెల్లించడం లేదని వారు ఆందోళన బాట పట్టారు. విషయం తెలుసుకున్న డివిజన్ శానిటరీ ఇన్ స్పెక్టర్ జనార్ధన్ అక్కడకు చేరుకుని... వారితో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. సెలవు రోజుల్లోనూ గైర్హాజరీ వేసి జీతాల్లో కోత విధిస్తున్నారంటూ కార్మికులు అధికారుల వద్ద తమ గోడును వినిపించారు. వెంటనే వేతనాలు చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News