: ఎయిర్ ఇండియా టిక్కెట్ ధర రూ. 100 మాత్రమే!


విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలానికి వంద రూపాయలకే విమాన టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. సర్ ఛార్జి, పన్నులు-సుంకాలు వంటివి అదనం. ఎయిరిండియా వెబ్ సైట్ లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు టిక్కెట్లు కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 30వ తేదీ మధ్యలో ప్రయాణించవచ్చు. ఇండియన్ ఎయిర్ లైన్స్ విలీనమైన (27 ఆగస్టు) సందర్భంగా ఈ సరికొత్త ఆఫర్ ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది.

  • Loading...

More Telugu News