: చంపావతి నదిలో పడిన లారీ, ఇద్దరి మృతి


విజయనగరం జిల్లాలోని 16వ జాతీయ రహదారిపై నాతవలస వంతెనపై నుంచి లారీ చంపావతి నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ బుధవారం ఉదయం అదుపుతప్పి నాతవలస వద్ద వంతెన రెయిలింగ్ ను ఢీకొని చంపావతి నదిలో పడిపోయింది. క్లీనర్ అక్కడికక్కడే మరణించగా, తీవ్రగాయాలతో ఉన్న డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ తుదిశ్వాస విడిచాడు.

  • Loading...

More Telugu News