: అక్రమ నిర్మాణాల కూల్చివేత తర్వాత ఫుట్ పాత్ ఆక్రమణదారులపై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ
నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతపై దూకుడుగా ముందుకెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)... తాజాగా నగరంలోని ఫుట్ పాత్ ఆక్రమణలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే, ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ మియాపూర్ కు సమీపంలో ఉన్న చందానగర్ లో ఫుట్ పాత్ లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తోన్న చిరువ్యాపారుల దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలను చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేత పనులు జరుగుతోన్న సమయంతో చిరువ్యాపారుల ఆందోళనకు వివిధ పార్టీల రాజకీయ నాయకులు మద్దతు తెలపారు. కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేసిన బడా బాబులను వదిలి... తమలాంటి చిరు వ్యాపారులపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.