: వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుతోంది


ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో జురాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ ఇన్ ఫ్లో లక్షా 66 వేల 588 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 31 వేల 852 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 875.50 అడుగులు. మరో 10 అడుగుల నీరు చేరితే జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుంది.

  • Loading...

More Telugu News