: 9, 10 తరగతుల పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


9, 10 తరగతుల పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రతిపాదనను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకు బదులుగా ఇకపై 80 మార్కులకే పరీక్ష జరుగుతుంది. మిగిలిన 20 ఇంటర్నల్ మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుంచే సంస్కరణలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు రేపు (బుధవారం) తెలంగాణ డీఈవోలతో విద్యాశాఖ సమావేశమవుతోంది.

  • Loading...

More Telugu News