: అక్టోబరు 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో నిరంతర విద్యుత్: చంద్రబాబు
రాష్ట్రంలో అక్టోబరు 2వ తేదీ నుంచి నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గత మూడు నెలల్లో నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 7500 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ-విజయవాడ లైన్ లో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని పెట్రోలియం శాఖ మంత్రిని కోరామని చెప్పారు. డిజిటల్ ఇండియాలో నెంబర్ వన్ గా ఏపీ ఉండాలని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణలో నెలకొన్న కరవు, విద్యుత్ పరిస్థితులను ప్రధానికి వివరించామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో జల సంరక్షణకు కేంద్రం సహాయాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు.