: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు చూపాలని ప్రధానిని కోరా: చంద్రబాబు


రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని సహా మరికొన్ని ముఖ్య సమస్యలున్నాయని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇంకా రాలేదని చెప్పారు. ఉన్నతాధికారుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదన్నారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరి అభివృద్ధి సాధించేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. విభజన అనంతరం తలెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఏపీకి ఆదాయ మార్గాలు చూపాలని ప్రధానిని కోరామన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరామని ఆయన చెప్పారు. పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సాయం కోరామని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలోని ఆర్థిక ప్యాకేజీలను త్వరలో అమలు చేయాలని అరుణ్ జైట్లీని కోరామని ఆయన తెలిపారు. ఆదాయ లోటును భర్తీ చేయాలని జైట్లీని కోరామని బాబు చెప్పారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం సాయం కోరామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News