: బెంగళూరు రానున్న 'పరుగుల చిరుత'


చిరుతను తలపించే వేగంతో పరిగెత్తే ఉసేన్ బోల్ట్ అంటే తెలియని వారుండరు. ఈ జమైకా స్ప్రింటర్ బరిలో ఉన్నాడంటే ప్రత్యర్థులు 'టాప్' వదిలేసి మిగతా స్థానాల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి! ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఈ సూపర్ రన్నర్ కు నీరాజనాలు పలుకుతారు అభిమానులు. ఈ క్రమంలో భారత్ లోని ఫ్యాన్స్ ను పలకరించేందుకు బోల్ట్ సెప్టెంబర్ 2న బెంగళూరు వస్తున్నాడు. తన స్పాన్సర్ పూమా, ఆన్ లైన్ షాపింగ్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా నిర్వహించే ఓ పోటీలో విజేతలకు బోల్ట్ బహుమతి ప్రదానం చేస్తాడు. కాగా, ఈ పరుగుల వీరుడు గార్డెన్ సిటీ రానున్న విషయాన్ని నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. 28 ఏళ్ళ ఈ పొడగరి ఇప్పటివరకు 6 ఒలింపిక్ స్వర్ణాలను, 8 ప్రపంచ చాంపియన్ షిప్ టైటిళ్ళను ఖాతాలో వేసుకోవడం విశేషం. ముఖ్యంగా, 100మీ, 200మీ పరుగులో బోల్ట్ ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతేగాదు, తన దేశం కోసం 4×100మీ రిలే పోటీల్లోనూ పాల్గొని, అక్కడా రికార్డుల మోత మోగించాడు.

  • Loading...

More Telugu News