: ఎయిర్ ఏషియా టిక్కెట్ ధర రూ.600 మాత్రమే!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రమోషన్ లో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను ఈ సంస్థ తక్కువ ధరలకే అందిస్తోంది. బెంగళూరు నుంచి చెన్నై, కోచికి టిక్కెట్ ప్రారంభ ధర రూ.600 మాత్రమే. అలాగే బెంగళూరు నుంచి గోవాకు రూ.900, బెంగళూరు నుంచి చండీగఢ్, జైపూర్ లకు టిక్కెట్ ప్రారంభ ధర రూ.1900గా నిర్ణయించారు. అడ్వాన్స్ టికెట్ కొనుగోలుదారులు అక్టోబరు 26 నుంచి వచ్చే ఏడాది అక్టోబరు 24వ తేదీ మధ్య ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. ఈ నెల 31వ తేదీ లోపు టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.