: మెదక్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
మెదక్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు అయ్యింది. మెదక్ ఉప ఎన్నికలో గెలుపుపై టీఆర్ఎస్ కన్నేసింది. ఇంతకు మునుపు మెదక్ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడంతో ఆయన మెదక్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.