: ఈ ముంబయి 'గణపతి'కి కళ్ళుచెదిరే బీమా
వినాయక చవితి సమీపిస్తుండడంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. అప్పుడే మండపాలు ఏర్పాటు చేసి, అలంకరణ పనులు చేస్తున్నారు. ముంబయిలోని జీఎస్ బీ సేవా మండల్ వారు ఎప్పట్లానే ఈ ఏడాది కూడా భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ విగ్రహానికి నిర్వాహకులు ఎంత మొత్తానికి బీమా చేయించారో తెలుసా..? అక్షరాలా రూ.259 కోట్లు! అంటే, 5 రోజుల ప్రాతిపదికన రోజుకు రూ.51.7 కోట్లు. గతేడాది ఈ విగ్రహానికి రూ.223 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించారు. విగ్రహం, బంగారం, మండపం, అగ్నిప్రమాదం, ఉగ్రవాద దాడుల వంటి అంశాలను కవర్ అయ్యే విధంగా బీమా చేయించారు. ప్రముఖ బీమా సంస్థ 'న్యూ ఇండియా అస్యూరెన్స్' ఈ బీమా అందించింది.