: దొనకొండలో రియల్ ఎస్టేట్ 'భూమరాంగ్'!


దొనకొండలో రియల్ ఎస్టేట్ 'భూమరాంగ్' అయ్యింది. నిన్నమొన్నటి వరకు ఏపీ రాజధాని రేసులో విజయవాడతో పాటు దొనకొండకు కూడా భాగా అవకాశాలున్నాయనే ప్రచారం మీడియాలో బాగా జరిగింది. ఈ నేపథ్యంలో... చాలా మంది పెట్టుబడిదారులు, రాజకీయనాయకులు ఇక్కడ భారీ ఎత్తున భూములు కొన్నారు. దీంతో ఇక్కడ భూమికి హఠాత్తుగా కోట్ల రూపాయల ధర పలకడం ప్రారంభమైంది. అయితే ఈ నెలలో టీడీపీ సర్కార్ విజయవాడను తాత్కాలిక రాజధాని చేయడంతో పాటు.... విజయవాడ-గుంటూరు పరిసర ప్రాంతాలే శాశ్వత రాజధానిగా ఉండొచ్చనే సంకేతాలను గట్టిగా పంపడంతో దొనకొండలో ప్రస్తుతం రియల్ బూమ్ బాగా తగ్గిపోయింది. దీంతో ఇక్కడ భారీ స్థాయిలో భూములు కొన్న రాజకీయనాయకులు, వ్యాపారస్థులు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. రాయలసీమకు చెందిన ఓ ఎంపీ దొనకొండ ప్రక్కనే ఉన్న పాల్లేపల్లి గ్రామంలో 30 ఎకరాలు కొన్నారు. అలాగే, హైదరాబాద్ కు చెందిన ఓ బీజేపీ నాయకుడు ఇక్కడ సుమారు 70 ఎకరాలు కొనుగోలు చేశారు. వీరే కాకుండా ఇంకా చాలా మంది రాజకీయనాయకులు తమ స్థాయికి తగ్గట్టు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ వరకు దొనకొండ పరిసరప్రాంతాల్లో 450 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. అలాగే మరో 350 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కోసం వెయిటింగ్ లో ఉంది. ప్రస్తుతం పరిస్థితి తారుమారు అవడంతో ల్యాండ్ అగ్రిమెంట్స్ అన్నీ రిజిస్ట్రేషన్ల వరకు వెళతాయా అనే అనుమానం నెలకొంది. అయితే, త్వరలోనే దొనకొండలో ఓ ఎయిర్ పోర్ట్ తో పాటు... ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా ఏర్పాటు చేసే ప్రపోజల్ ఏపీ ప్రభుత్వం దగ్గర ఉందని... దీని వల్ల తమ పెట్టుబడికి వచ్చిన నష్టమేం లేదని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఆశావహంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News