: అర్జున అవార్డులు గుళ్ళో ప్రసాదంలా పంచిపెడుతున్నారు: మిల్కా


మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది అర్జున అవార్డుల వ్యవహారం ఓ ప్రహసనంలా తయారైంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు అర్హులను విస్మరించారని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ నాయకత్వంలోని అర్జున అవార్డు ఎంపిక కమిటీ తీరుతెన్నులు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పరుగుల వీరుడు మిల్కా సింగ్ స్పందిస్తూ, ప్రస్తుతం ఈ అవార్డులను గుళ్ళో ప్రసాదంలా పంచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. మార్గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "ఈ అవార్డు ప్రమాణాలను అందుకోని క్రీడాకారులను ఎందుకు గౌరవించాలి? నాకు పద్మశ్రీ వచ్చిన తర్వాత అర్జున ఇవ్వజూపారు, కానీ, నేను తిరస్కరించాను. అదెలా ఉందంటే... మాస్టర్ డిగ్రీ అందుకున్న వ్యక్తికి ఎస్ఎస్ సీ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఉంటుంది" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News