: యూపీలో వరదలకు నేపాల్ ను తప్పుబడుతున్న అఖిలేశ్
పదిరోజుల క్రితం మెరుపులా వరదలు వచ్చిపడడంతో ఉత్తరప్రదేశ్ ఎగువ జిల్లాల్లో సోమవారం నాటికి 95 మంది మరణించినట్టు తేలింది. దీనిపై స్పందించిన సీఎం అఖిలేశ్ యాదవ్, వరదల కారణంగా యూపీలో ప్రజలు మరణించడానికి నేపాల్ సర్కారే కారణమని ఆరోపిస్తున్నారు. నేపాల్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అక్కడి అధికారులు తమను హెచ్చరించలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే విపత్తు సంభవించిందని అన్నారు. దీనిపై మోడీ సర్కారు జోక్యం చేసుకోవాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, కేంద్రం యూపీ వరద బాధితులకు పరిహారాన్ని ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు.