: నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి పద్మారావు
నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అన్నారు. హైదరాబాదు ధూల్ పేటకు వెళ్లి నకిలీ మద్యం తయారీదారులకు అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు. నకిలీ మద్యం అమ్మే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి చెప్పారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో హాలోగ్రామ్ విధానం అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని, ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.