: విద్యాసాగరరావును గవర్నరుగా నియమించడంతో కరీంనగర్ లో సంబరాలు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నరుగా కేంద్రప్రభుత్వం నియమించడంతో కరీంనగర్ లో బీజేపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో జిల్లా బీజేపీ శ్రేణులు టపాసులు పేల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. కేంద్రం విద్యాసాగరరావు నిజాయతీని గుర్తించి, గవర్నరుగా నియమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.