: సభ నియమాలకు అనుగుణంగానే స్పీకర్ వ్యవహరించారు: చీఫ్ విప్


అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విఫ్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. స్పీకర్ సభా నియమాలకు అనుగుణంగానే వ్యవహరించారని, బడ్జెట్ పై చర్చలో సభ్యులు ప్రసంగించేందుకు స్పీకర్ తగినంత సమయం కేటాయించారని ఆయన అన్నారు. హైదరాబాదులో చీఫ్ విప్ మీడియాతో మాట్లాడుతూ... టీడీపీకి రెండున్నర గంటలు, బీజేపీ సభ్యులకు 30 నిమిషాలు కేటాయించారని అన్నారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు కూడా తగినంత సమయం కేటాయించారని ఆయన అన్నారు. స్పీకర్ పట్ల కనీస మర్యాద కూడా పాటించడం లేదని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. జగన్ నియంతగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గంట 50 నిమిషాల ప్రసంగంలో జగన్ నియంతలా మాట్లాడారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పదేపదే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారని, అందువల్లే స్పీకర్ సభ్యులను సభ నియమాలకనుగుణంగా సస్పెండ్ చేశారని ఆయన వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News