: వైసీపీకి కొత్తపల్లి గీత గుడ్ బై! టీడీపీతో కలిసి పనిచేసేందుకు రెడీ


వైసీపీతో ఇకపై కలిసి పనిచేయబోనని ఆ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి తాను ముందుకు వెళ్లాలని భావిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే అరకు అభివృద్ధి సాధ్యమని గీత స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ తనపై అనర్హత వేటు వేస్తే... టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీలో మహిళలకు గౌరవ మర్యాదలు ఏమాత్రం లేవని... ఫేస్ బుక్ లో తనపై అసభ్య పోస్టులు వచ్చినప్పటికీ... జగన్ ఇప్పటివరకు కనీసం స్పందించలేదన్నారు. జగన్ అన్నగా ఆదరిస్తారనుకున్నానని... కానీ ఇలా అవమానిస్తున్నారనుకోలేదని ఆమె వాపోయారు.

  • Loading...

More Telugu News