: అక్రమాస్తుల కేసులో మాయావతికి సుప్రీం నోటీసు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టు ఈరోజు (మంగళవారం) నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లోగా తన సమాధానాన్ని తెలిజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆమెను ఆదేశించింది. మాయావతిని విచారించడానికి తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయంటూ మేలో సుప్రీంకు సమర్పించిన ఓ నివేదికలో సీబీఐ తెలిపింది. ఈ క్రమంలో నివేదికను పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.