: జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాది: గొల్లపల్లి సూర్యారావు
వైకాపా అధినేత జగన్ ఓ ఆర్థిక ఉగ్రవాది అని... ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఏపీ శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు. జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టమని అన్నారు. జగన్ ది రాక్షస మనస్తత్వమని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తండ్రి ఏపీలో రాక్షసపాలన కొనసాగించారని మండిపడ్డారు.