: అమ్మాయి-అమ్మాయి ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకున్నారు!


ఇటీవల కాలంలో భారత్ లో అమ్మాయిలు పరస్పరం ఆకర్షితులవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని అబ్బూరుకు చెందిన వినుత (21), గరకహళ్ళికి చెందిన సుచిత్ర (21) పెళ్ళి చేసుకోవడం సంచలనం రేపింది. సమీప బంధువులైన వీరు చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నారు. తొలి నుంచి ఒకరిని వీడి మరొకరు ఉండలేనట్టుగా వ్యవహరించేవారు. ఈ క్రమంలో వినుత, సుచిత్ర నడుమ ప్రేమ చిగురించింది. అది మరింత ముదిరి పెళ్ళి చేసుకోవాలన్న బలమైన కోరికకు దారితీసింది. పెద్దలకు చెబితే వ్యతిరేకిస్తారని భావించి, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారు. దీనిపై వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఈ ఇద్దరు అమ్మాయిలను కనుగొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. వారిని ప్రశ్నించగా తాము వివాహం చేసుకున్నామన్న విషయాన్ని వెల్లడించారు. దీంతో, ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా, తాము కలిసే ఉంటామని, అందుకే పెళ్ళి చేసుకున్నామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News