: వైకాపా ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు
వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను శాసనసభ నుంచి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేశారు. స్పీకర్ వద్ద ఉన్న మైక్ ను విరగ్గొట్టినందుకు వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు వీరిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. సస్పెన్షన్ కు గురైన ఇద్దరూ వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే, శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలపై రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశ పెట్టారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగలడం, స్పీకర్ పైనే దాడికి యత్నించడం, మైకులు విరిచి అసెంబ్లీ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి కార్యకలాపాలకు వీరు పాల్పడ్డారని తన తీర్మానంలో యనమల పేర్కొన్నారు. దీన్ని స్వీకరించిన స్పీకర్... ఇరువురు సభ్యులను వెంటనే సస్పెండ్ చేశారు.