: 10 మంది పాక్ సైనికులను కాల్చి చంపిన బీఎస్ఎఫ్ జవాన్లు


పాకిస్థాన్ సైన్యానికి బీఎస్ఎఫ్ ఊహించని సమాధానం ఇచ్చింది. నిరంతరం, ఏదో ఒక చోట కవ్వింపులకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ, సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడే పాక్ ముష్కర సైన్యంపై భారత బీఎస్ఎఫ్ జవాన్లు విరుచుకుపడ్డారు. మన జవాన్ల కాల్పుల్లో ఏకంగా 10 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఊహించని విధంగా బీఎస్ఎఫ్ విరుచుకుపడటంతో... బోర్డర్ అవతల ఉన్న పాక్ సైనికులు బెంబేలెత్తి పోయారు. ఇటీవల కార్గిల్ పర్యటనలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం... భారత జవాన్లలో నూతనోత్తేజం నింపింది. దాంతో పాటు, బీఎస్ఎఫ్ జవాన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ చర్యలవల్లే పాక్ సైన్యంపై బీఎస్ఎఫ్ జవాన్లు విరుచుకుపడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News