: 15 నిమిషాల పాటు వాయిదా పడ్డ శాసనసభ


ఏపీ శాసనసభను స్పీకర్ కోడెల శివప్రసాదరావు 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుండగా... తాగునీటి సమస్యపై మాట్లాడాలని వైకాపా పట్టుబట్టింది. అంతే కాకుండా తమకు మాట్లాడేందుకు మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోడియంను వైకాపా నేతలు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ ఆర్డర్ లో లేకపోవడంతో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News