: ఏపీ శాసనసభలో గందరగోళం... సమయం ఇవ్వాల్సిందేనంటూ ప్రతిపక్షం ఆందోళన
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల ఆందోళనతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తమకు ఇంకా మాట్లాడేందుకు సమయం ఇవ్వాలంటూ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ తీరు సరిగాలేదని పలువురు అధికారపక్షం నేతలు మండిపడుతున్నారు. విపక్ష సభ్యుల్లో అనుభవ లేమి కనిపిస్తోందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో అన్నారు. సభలో వైసీపీ సభ్యులు అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసైనా రూలింగ్ పార్టీకి మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్ ను యనమల కోరారు. ప్రజలు వైసీపీ నేతల తీరును గమనిస్తున్నారని, మీ సభ్యులను కంట్రోల్ చేసుకోవాలని జగన్ కు ఆయన సూచించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి ఇది మీ ఇళ్లో లేక పార్టీ కార్యాలయమో కాదన్నారు.