: చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోండి: భారత్, పాక్ లకు ఐరాస సూచన
ఇరు దేశాల మధ్య పొడచూపిన విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితి మంగళవారం భారత్, పాక్ లకు సూచించింది. ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి భేటీ రద్దు కావడం, సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో, ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఈ మేరకు ఇరు దేశాలకు దిశానిర్దేశం చేశారు. శాంతియుత మార్గాల్లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ దిశగా ఇరు దేశాలను సమాయత్తం చేసేలా ప్రత్యక్ష రంగంలోకి దిగుతారా? అన్న ప్రశ్నకు బాన్ కీ మూన్ కార్యాలయం స్పందించలేదు.