: స్టార్ హోటల్లో ఎయిర్ హోస్టెస్ ల ఫోన్లు కొట్టేశారు
స్టార్ హోటల్లో ఎయిర్ హోస్టెస్ ల ఖరీదైన ఫోన్లు కొట్టేసిన ఘటన చోటుచేసుకుంది. కొచ్చికి చెందిన దీపికాదేష్ట, క్రిస్టిఎడుక్యులా జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్ లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన వీరు సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో డిన్నర్ చేసేందుకు వచ్చారు. భోజనం చేస్తున్న సమయంలో ఐఫోన్, సామ్‌సంగ్ నోట్-4 సెల్‌ఫోన్లు పక్కనే పెట్టుకుని భోజనం చేశారు. భోజనం హడావుడిలో పడిన వీరు కాసేపటి తరువాత చూడగా సెల్‌ఫోన్లు మాయమయ్యాయి. దీంతో వారు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.