: లైబీరియా నుంచి భారత్ కు 112 మంది... ముంబై ఎయిర్ పోర్ట్ లో అలర్ట్!


ఎబోలా మహమ్మారి బారినపడి అతలాకుతలమవుతున్న లైబీరియా నుంచి 112 మంది భారతీయులు మంగళవారం స్వదేశం రానున్నారు. వీరంతా తొలుత ముంబై చేరుకుని ఆ తర్వాత వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎబోలా వ్యాప్తి చెందిన లైబీరియా నుంచి వస్తున్న కారణంగా వారిలో ఎవరికైనా ఆ వ్యాధి సోకిందా? లేదా? అన్న విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాత కాని వారిని వదలడం సాధ్యం కాకపోవచ్చు. ఒకేసారి వందమందికి పైగా వస్తున్న నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో అలర్ట్ ప్రకటించారు. లిబియా నుంచి వస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా విమానాశ్రయ అధికారులు సిద్ధం చేశారు. లైబీరియా నుంచి వస్తున్న వారంతా వేర్వేరు విమానాల్లో వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News