: నందిగామలో పోటీ చేయాలా? వద్దా?... తర్జనభర్జన పడుతున్న కాంగ్రెస్


కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలపాలా? వద్దా? అనే విషయంలో ఏపీ కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై చర్చించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అందుబాటులో ఉన్న నేతలతో భేటీ కానున్నారు. అయితే, ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి నిలపరాదంటూ కొందరు టీడీపీ నేతలు రఘువీరారెడ్డిని కొద్ది రోజుల క్రితం కలసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News