: ఉత్సవాలకు సిద్ధమయిన గణాధిపతి
హైదరాబాదులో గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఖైరతాబాద్ లో గణనాయకుడు భారీ కాయుడై కొలువుదీరుతాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ గణేశ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ప్రతియేడులానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ వినాయకుడు భారీకాయుడై కొలువుదీరాడు. వినాయకుడి విగ్రహానికి రంగులు వేయడం పూర్తయింది. ఈసారి గణేశ్ ఉత్సవాల్లో వినాయక ప్రతిమతో పాటు నరసింహస్వామి, దుర్గాదేవి ప్రతిమలు కూడా కనువిందు చేయనున్నాయి.