: మదనపల్లెలో భారీ అగ్నిప్రమాదం...ఎగసి పడుతున్న అగ్ని కీలలు
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో అగ్నిప్రమాదం సంభవించింది. అరివేణి శిల్పకళాక్షేత్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, అగ్నికీలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటాలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సహాయసహకారాలు అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.