: ఫ్లిప్ కార్ట్ తో జతకట్టిన మోడీ సర్కారు
దేశీయ ఈ-రిటెయిల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో నరేంద్ర మోడీ సర్కారు జత కటకట్టింది. చేనేత కార్మికుల ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు తయారు చేసే ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ అమ్మిపెట్టనుంది. తద్వారా నేత కార్మికుల విక్రయంలో మధ్యవర్తుల వ్యవస్థను రూపుమాపేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. నేత కార్మికులకు మంచి ధర లభించేలా చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని జౌళి శాఖ కార్యదర్శి ఎస్ కే పండా తెలిపారు. అయితే ఫ్లిప్ కార్ట్ ఒక్కదానితోనే ఒప్పందం చేసుకోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నకు స్పందించిన ఆయన, పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నందునే ఫ్లిప్ కార్ట్ ఒక్కదానినే ఎంచుకున్నామని, ఆరు నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నామని చెప్పారు.