: స్పైస్ జెట్ బంపర్ ఆఫర్


స్పైస్ జెట్ మరో బంపర్ ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వస్తోంది. వన్‌వేలో 1,888 రూపాయలకే టికెట్‌ను ఆఫర్ చేసింది. ఈ నెల 27 వరకు దేశీయ విమానయాన సౌకర్యం అందిస్తోంది. ఈ ఆఫర్‌ పై టికెట్‌ బుక్‌ చేసుకున్న వారు సెప్టెంబర్‌ 25 నుంచి జనవరి 15 మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేశీయంగా కంపెనీ నెట్‌వర్క్‌లోని డైరెక్ట్‌, వయా విమానాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. టికెట్లు పరిమితంగా అందుబాటులో ఉన్నందువల్ల ముందు బుక్‌ చేసుకున్న వారికే లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News