: రాంగోపాల్ వర్మపై మల్కాజిగిరి కోర్టులో పిటిషన్


వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం ఏదో ఒక సంచలనం రేపే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మల్కాజిగిరి మెట్రోపాలిటన్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. లైమ్ లైట్ లో ఉండేందుకు సంచలన వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ తాజాగా సాక్షికిచ్చిన ఇంటర్వ్యూలో హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడారని కుషాయిగూడకు చెందిన న్యాయవాది సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వర్మపై 295 ఎ సెక్షన్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు నివేదిక సమర్పించాలని కుషాయిగూడ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

  • Loading...

More Telugu News