: నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు


మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్లు రానున్నారు. ఈ రాష్ట్రాలకు బీజేపీ సీనియర్ నేతలు కల్యాణ్ సింగ్, వీకే మల్హోత్రా, లాల్‌జీ టాండన్‌ల పేర్లను గవర్నర్లుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. గవర్నర్ల నియామకంపై రాష్ట్రపతి భవన్‌నుంచి అధికారిక ప్రకటనపై స్పష్టత రానప్పటికీ వీరి నియామకం ఖాయం అనేది సుస్పష్టం. కాగా, తనకు రాజస్థాన్ గవర్నర్ పదవిపై ప్రతిపాదన అందిందని, ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించానని కల్యాణ్ సింగ్ ఈ నెల 11న స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిజోరాం రాష్ట్రానికి బదిలీ చేసినందుకు నిరసనగా మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి, హెచ్‌ఆర్ భరద్వాజ్ ఐదేళ్ల పదవీకాలం ముగిసిపోవడంతో కర్ణాటక గవర్నర్ పదవి, మార్గరెట్ ఆల్వా పదవీకాలం ముగిసిపోవడంతో రాజస్థాన్ గవర్నర్ పదవి, బీవీ వాంఛూ రాజీనామాతో గోవా గవర్నర్ పదవి ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల్లోనే బీజేపీ సీనియర్ నేతలు కూర్చోనున్నారు.

  • Loading...

More Telugu News