: షీలా దీక్షిత్ కూడా వైదొలగుతారా?... రాష్ట్రపతిని కలవడంలో ఆంతర్యం?
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. త్రిపురకు బదిలీ అయిన మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్ తన పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో షీలాదీక్షిత్ రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన వారంతా పదవుల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఆమె ఢిల్లీ పర్యటన పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. కాగా, ఢిల్లీ వచ్చిన ప్రతిసారి రాష్ట్రపతిని కలుస్తుంటానని ఆమె తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన అనంతరం ఆమె రాష్ట్రపతిని కలవడంతో రాజీనామాపై చర్చ రేగింది. ఇంతకీ ఆమె వైదొలగుతున్నారా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.